వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న వరుణ యాగం రెండోరోజూ కొనసాగింది. న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధివినాయక ఆలయం ప్రాంగణంలోని యాగ మండపంలో రెండో రోజు సామూహిక వరుణ మహోత్సవం జరిగింది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆవాహిత దేవతాపూజ, వరుణ జప హోమం, గణపతి హోమం, మహా నైవేద్యం, మహా మంగళ హారతి, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. వరుణుడు కటాక్షించి వానలు పడేలా చూడాలని వేడుకుంటూ మహా శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. గణపతి ప్రతిమను అభిషేకిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు. చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో యాగ మహోత్సవం పూర్తవుతుందని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తెలియజేశారు.
రెండో రోజు కొనసాగిన సామూహిక వరుణ మహోత్సవం - రెండో రోజు కొనసాగిన సామూహిక వరుణ మహోత్సవం
సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వరుణ యాగం రెండోరోజు కొనసాగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకుంటూ మహాశివలింగానికి జలాభిషేకం నిర్వహించారు.
రెండో రోజు కొనసాగిన సామూహిక వరుణ మహోత్సవం