సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పై పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్తలతో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ కళావతి అన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని ఆమె చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పై నిబద్ధత కలిగి ఉంటామని పారిశ్రామికవేత్తలతో ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణం పరిరక్షణ... ప్రతి ఒక్కరి బాధ్యత...
పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ప్రతి ఒక్కటి పర్యావరణం సానుకులంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యకరంగా జీవిస్తాము. పర్యావరణ పరిరక్షణ సరిగా లేకపోతే జీవ మనుగడకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణ పరరిక్షణకు కృషి చేయాలి.
పర్యావరణం పరిరక్షణ...ప్రతి ఒక్కరి బాధ్యత