సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారంలో అక్రమ మద్యం అమ్మకాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు దుకాణాల్లోని మద్యం సీసాలను ధ్వంసం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని తీర్మానాలు చేసినా.... కొందరు దుకాణాలు నడపుతున్నారని ఆరోపించారు.
మద్యం విక్రయాలపై మహిళల ఆగ్రహం... సీసాలు ధ్వంసం - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామంలో మద్యం సీసాలను మహిళలు ధ్వంసం చేశారు. మద్యం అమ్మవద్దని ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా దుకాణాలు నడపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అక్రమ మద్యం అమ్మకాలపై మహిళల ఆగ్రహం... మద్యం సీసాలు ధ్వంసం
అక్రమంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల.... యువత బానిసలు అవుతున్నారని వాపోయారు. ఇవాళ మహిళలంతా కలిసి మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి సీసాలను పగలగొట్టారు. దుకాణదారుల తీరు మారకపోతే ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి:భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య