సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వారు గమనించి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు.. గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు సుమారు 35సంవత్సరాలు ఉంటుందని సీఐ వెంకటేష్ తెలిపారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. జిల్లా కేంద్రంలో హత్యకు గురికావడంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.. ఘటన స్థలాన్ని పరిశీలించి.. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సూచించారు.
ఆసుపత్రి ఆవరణలో మహిళ దారుణ హత్య
ఆసుపత్రి ఆవరణలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సంగారెడ్డిజిల్లాలో చోటుచేసుకుంది.
ఆసుపత్రి ఆవరణలో మహిళ దారుణ హత్య