తెలంగాణ

telangana

ETV Bharat / state

వంతెనపై నుంచి పడిపోయిన స్కూటి.. మహిళా ఉద్యోగిని మృతి

విధుల నిర్వహణలో భాగంగా ఓ ఉద్యోగిని తన ఇరువురు పిల్లలతో కలిసి స్కూటీపై బయలుదేరింది.. కానీ తిరిగి రాలేదు.. మార్గ మధ్యలో ఓ వంతెనపై నుంచి స్కూటీ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Woman killed by a scooty from a bridge at sangareddy district
వంతెనపై నుంచి పడిపోయిన స్కూటి.. మహిళా ఉద్యోగిని మృతి

By

Published : Jan 31, 2020, 8:44 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చప్టా వంతెనపై నుంచి స్కూటి అదుపుతప్పి ప్రభుత్వ ఉద్యోగిని కమల మృతి చెందారు. నారాయణఖేడ్​కు చెందిన కమల కంగ్టిలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శుక్రవారం ఉదయం తన ఇరువురు పిల్లలతో కలిసి స్కూటీపై నారాయణఖేడ్ నుంచి కంగ్టి వైపు బయలుదేరారు.

నారాయణఖేడ్ మండలంలోని చప్టా వద్ద ఉజలం పాడు వాగు వంతెన దాటుతున్న సమయంలో ఆమె స్కూటి అదుపు తప్పి కింద పడిపోయింది. సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి వారు కింద పడటం వల్ల ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళ్తున్న కంగ్టి ఎస్సై సమాచారం తెలుసుకుని వెంటనే నారాయణ ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చివరకు సంగారెడ్డిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కమల పిల్లలు నాని, లక్కీలు గాయాలతో చికిత్స పొందుతున్నారు. కంగ్టి ఎస్ఐ అబ్దుల్ రఫిక్, నారాయణఖేడ్ ఎస్ఐ సందీప్ వివరాలను వెల్లడించారు.

వంతెనపై నుంచి పడిపోయిన స్కూటి.. మహిళా ఉద్యోగిని మృతి

ఇదీ చూడండి :'ఇళ్ల నిర్మాణాలు ఉగాదిలోపు పూర్తి చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details