సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కొర్పోల్లో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణనాథుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కర్ని ఆంజనేయులు చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం రాత్రి గణపతులను నిమజ్జనం చేసేందుకు గ్రామశివారులో ఉన్న భామనికుంట చెరువుకు తరలించారు. చెరువులో గణపతి నిమజ్జనం చేసేందుకు ఆంజనేయులు విగ్రహాన్ని తలపై పెట్టుకొని దిగుతుండగా.. జారిపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి - కొర్పోల్
గణనాథుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలో చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొర్పోల్లో చోటు చేసుకుంది.
నిమజ్జనంలో అపశ్రుతి