సంగారెడ్డి నియోజకవర్గంలో డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. పట్టణ పరిధిలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద డీఎస్పీ తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేశారు.
‘అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు’ - తెలంగాణ వార్తలు
అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు. సంగారెడ్డి నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఆయన తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటికి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు.
‘అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు’
అత్యవసర సమయంలో మాత్రమే బయటకి రావాలని, ఉదయం, మినహాయింపు సమయంలో కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ అన్నారు. అకారణంగా బయటకి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఉగాండా నుంచి వచ్చి వ్యభిచారం.. మహిళలు అరెస్ట్