తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో కారు-బైకు ఢీ.. ఇద్దరు మృతి - జహీరాబాద్​లో కారు-బైకు ఢీ.. ఇద్దరు మృతి

ద్విచక్రవాహనం-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ శివారులో జరిగింది.

జహీరాబాద్​లో కారు-బైకు ఢీ.. ఇద్దరు మృతి

By

Published : Oct 5, 2019, 7:37 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మెటల్​కుంటకు చెందిన ద్విచక్రవాహనదారుడు బైపాస్​ రోడ్డులోని అల్గోల్ కూడలి దాటుతుండగా.. హైదరాబాద్​ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. సమాచారం అందుకున్న జహీరాబాద్​ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన చోదకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జహీరాబాద్​లో కారు-బైకు ఢీ.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details