జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితంలో 11,830 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం మొదటి రౌండు నుంచి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సురేష్ షట్కార్పై లక్షా నలభై ఓట్ల ఆధిక్యంతో బీబీ పాటిల్ విజయ భేరి మోగించారు. ఈసారి ఎంత ఆధిక్యం వస్తుందో చూడాలి. పాటిల్ ఆధిక్యంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
జహీరాబాద్లో ఆధిక్యంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ - పార్లమెంటు ఎన్నికల ఫలితాలు
జహీరాబాద్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ఉదయం నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
తెరాస అభ్యర్ధి
తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే బీబీ పాటిల్ గెలుపునకు దోహదపడుతున్నాయి. భాజపా అభ్యర్థి లక్ష్మారెడ్డి మోదీ మానియా ఇక్కడ పనిచేయడం లేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్రావు ఎదురీదుతున్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్లో ఎంఐఎం, భాజపా హోరాహోరీ
Last Updated : May 23, 2019, 2:19 PM IST