ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత నాలుగున్నరేళ్ల తెరాస పాలనలోప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయని... ఈ పథకాలపై దేశప్రజలు కూడా అసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
16 ఎంపీ స్థానాలు గెలిపిద్దాం: ప్రశాంత్‌రెడ్డి - పార్లమెంటు
సంగారెడ్డిలో నిర్వహించిన తెరాస పార్లమెంటు ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలిపించాలని నిర్దేశించారు.
16 ఎంపీ స్థానాలు గెలిపిద్దాం
రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే... ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ని రెండున్నర లక్షల మెజార్టీతో గెలిపించుకోవచ్చని సూచించారు. రెండోసారి టికెట్టు కేటాయించడం సంతోషంగా ఉందని... మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అభ్యర్థి బీబీపాటిల్ తెలిపారు.
ఇదీ చూడండి: చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం
Last Updated : Mar 25, 2019, 7:51 PM IST