సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గీతానగర్ కాలనీలో దొంగలు మూడు ఇళ్లలో బంగారం, నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. మరో రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేసినట్లు పేర్కొన్నారు. కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల దొంగల ఆచూకీ తెలుసుకోవడం సులభం అయిందని, వీలైనంత త్వరలో పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.
పట్టపగలే దొంగల బీభత్సం... సీసీ ఫుటేజీతో గుర్తింపు
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పట్టపగలే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
పట్టపగలే దొంగల బీభత్సం... సీసీ ఫుటేజీతో గుర్తింపు