సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
'ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన' - ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వార్తలు
తెలంగాణ ప్రజల మనోభావలను గౌరవిస్తూ తెరాస పాలన సాగుతోందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
'ప్రజల మనోభావాలు గౌరవించేది తెరాస ప్రభుత్వమే'
దేవాలయాల భూములు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షించాలని... దేవాలయ అభివృద్ధికి అందరితో కలిసి ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు గౌరవిస్తూ... అందరినీ సమానత్వంగా తీసుకుపోతున్న ఏకైక ప్రభుత్వం తెరాసదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు