సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యాధికారుల బృందం పర్యటించింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేయడానికి.. వైద్యాధికారి సోమ్ పాల్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చింది. వారికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలను గూర్చి వివరించగా.. భేష్ అని కితాబిచ్చారు. తెలంగాణలో మాదిరిగా.. తమ రాష్ట్రంలో కూడా వినూత్న పథకాలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు.
సంగారెడ్డి ఆసుపత్రిలో యూపీ వైద్యబృందం పర్యటన - schemes
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యాధికారుల బృందం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించింది. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాల గురించి తెలుసుకున్నారు.
యూపీ వైద్యబృందం పర్యటన