తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు రోజులైనా పట్టించుకోరా: ఎల్​. రమణ - sangareddy district latest news

మురుగు కాలువ వరదలో కారుతో సహా ఆనంద్ అనే వ్యక్తి కొట్టుకుపోయి ఐదు రోజులైనా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ ఇసుక బావి వద్ద ఆనంద్​ కొట్టుకుపోయిన మురుగు కాలువ వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు

tdp state president l. ramana visited aminpur in sangareddy district
ఐదు రోజులైనా పట్టించుకోరా: ఎల్​. రమణ

By

Published : Oct 17, 2020, 10:19 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ ఇసుక బావి వద్ద ఆనంద్ అనే వ్యక్తి కొట్టుకుపోయిన మురుగు కాలువ వంతెన ప్రాంతాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ సందర్శించారు. ఆనంద్​ గల్లంతై ఐదురోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం దారుణమన్నారు.

రెవెన్యూ, రెస్క్యూ బృందాలు, పోలీసులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగేవి కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తిపడి మొబిలైజ్ అడ్వాన్స్ పేరు మీద బిల్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్​ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని చెప్పి బురదమయంగా మార్చారని ఎద్దేవా చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం.. రమణ ఆనంద్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్​ జామ్​

ABOUT THE AUTHOR

...view details