స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకాంక్షించారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
'యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలి' - సంగారెడ్డి వార్తలు
స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలి'
వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. ఆయన నడిచిన బాట ఎందరికో స్ఫూర్తి దాయకమని.. దేశానికి గొప్ప పేరు తెచ్చారని కొనియాడారు.
ఇదీ చూడండి: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు