గ్లోబల్ కాంపిటీషన్లో తమ విద్యార్థులు పాల్గొనే విధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే విద్యార్థులు నిరంతరం పోరాడుతూనే ఉండాలన్నారు. దానివల్ల ఇప్పటికిప్పుడే విజయం వరించనప్పటికీ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆయన వివరించారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిరంతరం పోరాడాలి: ప్రవీణ్ కుమార్
గ్లోబల్ కాంపిటీషన్లో తమ విద్యార్థులు పాల్గొనే విధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిరంతరం పోరాడాలి: ప్రవీణ్