ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలంటూ సంగారెడ్డిలో రావూస్ పాఠశాల విద్యార్థులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డుపై నృత్యాలు, నాటికలు వేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే అనర్థాలను, పాటించడం వల్ల కలిగే లాభాలను వివరించారు.
రోడ్డుపై నృత్యాలు, నాటికలు..ట్రాఫిక్‌పై విద్యార్థుల అవగాహన - రావూస్ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఫ్లాష్‌మాబ్ చేశారు
సంగారెడ్డిలో రావూస్ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఫ్లాష్‌మాబ్ చేశారు. నృత్యాలు, నాటికలు వేస్తూ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
రోడ్డుపై నృత్యాలు, నాటికలు వేసిన విద్యార్థులు
ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించిన రావూస్ పాఠశాల యాజమాన్యానికి ట్రాఫిక్ సీఐ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మిగతా పాఠశాలలు కూడా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణలో భాగమవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి :మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త..