సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం రుద్రారం స్టేజీ వద్ద బస్సులు నిలపట్లేదంటూ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నారాయణఖేడ్-రాయపల్లి రహదారిలో రోడ్డుపై గంటసేపు బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు 200 మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం విద్యార్థులు వారిని నిలదీశారు. పాఠశాలకు సకాలంలో వెళ్లకపోతే ఉపాధ్యాయులు తమను మందలిస్తున్నారని.. ఇక్కడ బస్సులు ఎందుకు నిలపట్లేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చినందున వారు ఆందోళన విరమించారు.
విద్యార్థుల ఆందోళన.. ఆర్టీసీ అధికారుల హామీతో విరమణ - సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం
పాఠశాల వెళ్లేందుకు స్టేజీ వద్ద బస్సు ఆపాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
రుద్రారం స్టేజీ వద్ద బస్సులు నిలపట్లేదని విద్యార్థుల ఆందోళన
ఇవీ చూడండి : విశిష్ట కట్టడానికి ప్రపంచ వారసత్వ హోదా!