తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా సీతారాముల కల్యాణం - శ్రీ సీతారాముల కల్యాణం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాముడి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్​ రెండో దశ నేపథ్యంలో.. కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరిపారు.

Sitarama Kalyana Mahotsavam
శ్రీరామ నవమి వేడుకలు

By

Published : Apr 21, 2021, 4:03 PM IST

కరోనా రెండో దశ ప్రభావంతో.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. అర్చకులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. రాములోరి కల్యాణాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. పూల మాలలతో ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.

ఈ ఏడాది కొవిడ్ ఉద్ధృతి లేకుంటే.. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగేవని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో కరోనా మహమ్మారి బాధలు త్వరగా తొలగిపోయి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం

ABOUT THE AUTHOR

...view details