Amith Jingran: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పించేందుకు.. గ్రామాల్లో సంధ్యా శిబిరాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ తెలిపారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ శిబిరాలు నిర్వహించామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా చర్లగూడెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ జింగ్రాన్ పాల్గొన్నారు.
బ్యాంకులో అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి అక్కడి ప్రజలకు అమిత్ జింగ్రాన్ అవగాహన కల్పించారు. పొదుపు సంఘాల మహిళలకు కోటి రూపాయల రుణం అందజేశారు. ఈ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని ఆయన ఆకాక్షించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగిస్తామని అమిత్ జింగ్రాన్ స్పష్టం చేశారు.