తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరు చెక్​పోస్ట్ వద్ద ఎస్పీ తనిఖీలు - తెలంగాణ వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారులోని బాహ్యవలయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టును ఎస్పీ చంద్రశేఖర రెడ్డి పరిశీలించారు. లాక్​డౌన్ పూర్తిగా అమలయ్యేలా సిబ్బందిని మోహరించామని తెలిపారు. అత్యవసర సేవల వాహనాలనే అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.

sangareddy sp inspection, lock down in sangareddy
పటాన్​చెరు చెక్​పోస్ట్ వద్ద ఎస్పీ తనిఖీలు, సంగారెడ్డిలో ఎస్పీ తనిఖీలు

By

Published : May 12, 2021, 4:25 PM IST

సంగారెడ్డి జిల్లాలో లాక్​డౌన్ పూర్తిగా అమలయ్యేలా సిబ్బందిని మోహరించామని ఎస్పీ చంద్రశేఖర రెడ్డి తెలిపారు. పటాన్​చెరు శివారులోని బాహ్య వలయ రహదారి కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారిపై అత్యవసర రవాణా వాహనాలకు అనుమతి ఉందని... ఇతర వాహనాలు నిలువరిస్తున్నామని వెల్లడించారు.

వాహనాల్లో వెళ్లే వారి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ సేవల కోసం వెళ్లేవారిని అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​!

ABOUT THE AUTHOR

...view details