తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు' - తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ

రాష్ట్రంలో కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జహీరాబాద్​ పోలీసులు హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శంకరరాజు మీడియా సమావేశం నిర్వహించారు.

Telangana news
dsp sankararaju

By

Published : Apr 22, 2021, 6:40 PM IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని జహీరాబాద్​ పోలీసులు కోరారు. రాత్రివేళ అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

అత్యవరసం లేకుండా రాత్రి 9గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. దూర ప్రయాణాలు చేసొచ్చిన ప్రయాణికులు... పోలీసులు అడినప్పుడు బస్సు టికెట్లు చూపించాలని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం సబ్​డివిజన్​ కార్యాలయం ఆవరణలో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ... బాటసారులకు అందించారు.

ఇదీ చూడండి:ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల

ABOUT THE AUTHOR

...view details