సంగారెడ్డి జిల్లా రామేశ్వరంబండ గ్రామ పంచాయతీని జిల్లా పాలనాధికారి హనుమంతరావు తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలోపు డంప్ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.
అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు: కలెక్టర్ హనుమంతరావు - sangareddy district news
డంప్ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరంబండ గ్రామపంచాయతీని స్థానిక అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
పనుల్లో జాప్యం చేస్తే సహించబోం: జిల్లా పాలనాధికారి
పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా పాలనాధికారి.. జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆయా మండలాల్లో మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పనుల పురోగతి మెరుగుపడేలా చూడాలని తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా కట్టడిలో లోపాలున్నయ్.. వాస్తవమే: మంత్రి కేటీఆర్