తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్యంపై కలెక్టర్ సీరియస్.. పంచాయతీ కార్యదర్శికి షోకాజ్​ నోటీసు - sangareddy district news

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​ గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిశంకర్​కు జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. డంప్​ యార్డు, వైకుంఠధామం, నర్సరీ పనుల్లో పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై మండిపడ్డారు.

కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు జారీ చేసిన కలెక్టర్​
sangareddy collector serious on panchayath secretary

By

Published : Jun 24, 2020, 5:43 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం బాగాలేదని, డంప్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ పనుల్లో పురోగతి లేదని కార్యదర్శి హరిశంకర్​కు జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇస్నాపూర్​లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా పనులను పరిశీలించారు. చెత్తను దారిలో వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వకుండా కలిపి ఇస్తున్న ఇంటికి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. తడి, పొడి చెత్తలు వేర్వేరుగా ఇచ్చేలా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.

ఇవీ చూడండి: పని దొరికితేనే పూటగడుస్తోంది.. లేకుంటే అదోగతే.!

ABOUT THE AUTHOR

...view details