తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో సద్దుమణిగిన లొల్లి.. శాంతించిన కార్మికులు - attack on police in sangareddy

సంగారెడ్డిలో వలస కార్మికుల ఆందోళన సద్దుమణిగింది. వలస కార్మికులతో కలెక్టర్​ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డిల చర్చలు ఫలించాయి. కార్మికుల ఆందోళన వెనకున్న ఇబ్బందులను తెలుసుకున్న కలెక్టర్​.. యాజమాన్యంతో చర్చించారు. మార్చి, ఏప్రిల్​ నెల జీతాలు రేపు సాయంత్రంలోగా విడుదల చేయాలని ఆదేశించారు. రేపట్నుంచి పనిచేసేందుకు కార్మికులు అంగీకరించారని తెలిపారు.

sangareddy news
రేపట్నుంచి విధుల్లోకి కార్మికులు: సంగారెడ్డి కలెక్టర్​

By

Published : Apr 29, 2020, 1:39 PM IST

Updated : Apr 29, 2020, 2:07 PM IST

సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్​ వద్ద జరిగిన వలస కార్మికుల ఆందోళన సద్దుమణిగింది. పెద్ద ఎత్తున కార్మికులు గూమిగూడడం వల్ల అప్రమత్తమైన కలెక్టర్​ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి వారితో చర్చించారు. కార్మికుల ఆందోళన వెనకున్న సమస్యలను తెలుసుకున్న కలెక్టర్​.. సంస్థ యాజమాన్యంతో చర్చించారు. మార్చి, ఏప్రిల్​ నెల జీతాలు రేపు సాయంత్రంలోగా విడుదల చేయాలని ఆదేశించారు. రేపట్నుంచి పనిచేసేందుకు కార్మికులు అంగీకరించారని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు, భౌతికదూరం పాటిస్తూ పనులు చేస్తారన్నారు. లాక్‌డౌన్ వేళ స్వస్థలాలకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టంచేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం కార్మికులు ఒత్తిడిలో ఉన్నారని.. తర్వాత వివరంగా మాట్లాడతామని ఎస్పీ వెల్లడించారు. ఎలాగైనా స్వస్థలాలకు వెళ్లాలనేదే కార్మికుల ఉద్దేశమన్నారు ఘటనలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. కార్మికులెవరిపైనా కేసులు నమోదుచేయలేదన్నారు.

సద్దుమణిగిన లొల్లి.. శాంతించిన కార్మికులు

ఇవీచూడండి:ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి

Last Updated : Apr 29, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details