సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భాజపా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. కరోనా వైరస్,, లాక్డౌన్ వల్ల దేశంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి మోదీ ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ కింద దేశానికి రూ.20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని భాజపా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు.
మోదీ చిత్రపటానికి భాజపా నేతల పాలాభిషేకం
చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొని దేశం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోగిస్తున్న ఆర్థిక ఎత్తుగడలను స్వాగతిస్తూ భాజపా నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టే మేధస్సు మోడీకి ఉందని అన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తూ.. సులభంగా రుణాలు అందించే పథకం ఇది అని వారు అన్నారు. ఎలాంటి గ్యారెంటీ, అదనపు ఛార్జీలు లేకుండా పన్నెండు నెలల పాటు కిస్తీలు కట్టాల్సిన అవసరం లేకుండా చిన్న పరిశ్రమలు స్థాపించే వారికి లోన్లు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమల కోసం రూ.20వేల కోట్లు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగంలో ఆగిపోయిన పనుల కొరకు ఆరు నెలల గడువు, ఎలక్ట్రిసిటీ డిస్కంలకు రూ.90వేల కోట్లు లాంటి ఎన్నో లాభాపేక్ష కార్యక్రమాలు చేపడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ ప్యాకేజీ వల్ల పరిశ్రమల రంగం తిరిగి బలోపేతమవడమే కాక.. ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
ఇదీ చూడండి:ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు