సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారిపై సంచలనం రేగిన మహబూబ్ హత్య కేసులో పటాన్ చెరువు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన వీరంతా చౌక బియ్యం అక్రమ రవాణా చేసేవారు. ఇందులోని ఒక వర్గానికి మరొక వర్గానికి శతృత్వమే ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు అయితే మహబూబ్‌ను హత్య చేసిన వారు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఈ హత్య జరిగిన విధానాన్ని నిందితులు మహబూబ్‌ను ఎక్కడి నుంచి వెంబడించారు అనే వివరాల కోసం సీసీ పుటేజీ పరిశీలిచేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
రుద్రారం హత్య: పోలీసుల అదుపులో నిందితులు..? - undefined
నిన్న కలకలం సృష్టించిన రుద్రారం హత్యలో పురోగతి కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యను ఛేదించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పటాన్ చెరు పోలీసులు తెలిపారు.
రుద్రారం హత్య: పోలీసుల అదుపులో నిందితులు...?
TAGGED:
rudraram