ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని.. అదే విధంగా వేతన సవరణ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రాష్ట్రం సాధించుకుంటే సమస్యలు తీరుతాయని ఆశించామని.. కార్మికులకు ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన - ఆర్టీసీ కార్మికుల
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు.
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన