ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ ఈడీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోలో ఆయన తనిఖీ చేపట్టారు. అనంతరం గ్యారేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. డిపోలోని సౌకర్యాలను పరిశీలించి కార్మికులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
'జహీరాబాద్ ఆర్టీసీ డిపోను దత్తత తీసుకున్నా' - latest news sangareddy
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోను ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ ఈడీ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాను జహీరాబాద్ డిపోను దత్తత తీసుకున్నట్టు తెలిపారు.
జహీరాబాద్ డిపోను దత్తత తీసుకున్న:ఆర్టీసీ ఏఈడీ వెంకటేశ్వరరావు
సీఎం కేసీఆర్ సూచించిన విధంగా రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అంకితభావంతో పనిచేస్తే వచ్చే లాభాల్లో నుంచి అందరికీ బోనస్లు పంచుకునే అవకాశం ఉందన్నారు.రాష్ట్రంలోని అన్ని డిపోలకు జహీరాబాద్ డిపో ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని సూచించారు.