తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షానికి వంతెన ధ్వంసం.. రాకపోకలకు అంతరాయం - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

వరదల తాకిడి నుంచి సంగారెడ్డి జిల్లా ఇంకా కోలుకోకముందే మళ్లీ కురిసిన వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి నారాయణ ఖేడ్​ ప్రాంతంలో రోడ్లు ధ్వంసం అయ్యాయి.

roads destroyed in sangareddy district
భారీ వర్షానికి ధ్వంసమైన వంతెన.. నిలిచిన రాకపోకలు

By

Published : Oct 18, 2020, 12:14 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు దెబ్బ తిన్నాయి. పట్టణం నుంచి ఆయా గ్రామాలకు అనుసంధానం అయ్యే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

కంగ్టి, సిర్గాపూర్ మండలానికి చెందిన 30 గ్రామాల నుంచి ఖేడ్​కు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:భాగ్యనగరంలో కాలనీలు జలమయం... అవస్థల్లో జనం

ABOUT THE AUTHOR

...view details