సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సారసాలలో అటవీశాఖ క్షేత్ర అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఇటీవల ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళా అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలని వినతిపత్రం సమర్పించారు.
బ్యాడ్జీలు ధరించి రెవెన్యూ ఉద్యోగుల నిరసన
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సారసాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
TAGGED:
రెవెన్యూ ఉద్యోగుల నిరసన