సంగారెడ్డి పట్టణంలో ఓ ఖైది తన భార్యను హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భార్యను హత్యచేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త - సంగారెడ్డి నేరవార్తలు
10:09 July 09
భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శంకర్ అనే వ్యక్తి ఇటీవల 14 రోజుల పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. భార్యపై అనుమానంతో ఏడో తేదీ రాత్రి తన భార్య స్రవంతిని హత్య చేశాడు. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రెండు రోజులుగా భార్యాభర్తలు ఇంటిలోంచి బయటికి రాకపోవడంతో.. కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. విగత జీవులుగా పడి ఉన్న శంకర్, స్రవంతిలను గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్షల కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీచూడండి:టోల్ సిబ్బందిపై వ్యక్తి దాడి.. సెక్యూరిటీ గార్డుకు గాయాలు