రేషన్డీలర్లు దయతలిస్తేనే పేదలకు బియ్యం దొరికే పరిస్థితులు నెలకొంటున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రేషన్ దుకాణంలో ఉదయం ఎనిమిది గంటలకు బియ్యం ఇస్తామని ప్రకటించడం వల్ల కార్డుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ రేషన్ డీలర్ మాత్రం మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటుతున్నా రాలేదు.
కార్డుదారుల కష్టాలు.. డీలర్ల నిర్లక్ష్యం - రేషన్డీలర్ల
రేషన్డీలర్ల నిర్లక్ష్యానికి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న 12కిలోల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు చేరువ అవడం లేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఓ రేషన్ దుకాణం ముందు పెద్ద ఎత్తున కార్డుదారులు క్యూలో ఉన్నప్పటికీ డీలర్ సమయపాలన లోపం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
దానితో లబ్ధిదారులు క్యూలైన్లో నిలుచుని పడిగాపులు కాచారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉచితంగా 12 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నప్పటికీ రేషన్ డీలర్ల నిర్లక్ష్యం కారణంగా సమయానికి పంపిణీ జరగడం లేదు. వేలిముద్రల ద్వారా పంపిణీకి సర్వర్ మొరాయించడం లాంటివేవీ లేకుండా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే రేషన్ డీలర్ల వైఖరితో ఉచిత బియ్యం పంపిణీ నీరుగారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుకాణాల వద్ద పంపిణీని పరిశీలించి డీలర్లపై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!