తెరాస ప్రభుత్వంలో ప్రజాసమస్యలపై మాట్లాడే పరిస్థితే లేకుండా పోయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళా సంఘాల అభివృద్ధి, నిరుద్యోగ భృతి, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బీసీల కోసం ఈనెల 30న సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈనెల 30న నిరనస దీక్ష చేస్తున్నా: జగ్గారెడ్డి - sangareddy news
ఈనెల 30న సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో దీక్ష చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. 57 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న తెరాస హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈనెల 30న నిరనస దీక్ష చేస్తున్న: జగ్గారెడ్డి
లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అన్ని మతాలు, కులాలకు చెందిన పేదవారికి ఓపెన్ ప్లాట్‌తోపాటు ఇళ్లు కట్టుకోవడానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. 57 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న తెరాస హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చదువు, పెళ్లి వరకు ప్రభుత్వమే ఆర్థిక భారం భరించాలన్నారు.
ఇవీచూడండి :ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు