సంగారెడ్డి పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపానికి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం సంఘ విద్రోహుల చేతిలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారన్నారు.
సంగారెడ్డిలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం - police myrtys day in sangareddy
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని సంగారెడ్డి పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు.
సంగారెడ్డిలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం
అమరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్లో వివిధ పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి