తెలంగాణ

telangana

ETV Bharat / state

శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు - శివానగర్​ హత్య కేసు తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా శివానగర్​లో గత నెల 30న జరిగిన సుధాకర్​ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రిమాండ్​కు తరలించారు.

police arrested four persons for Sivanagar murder case
శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

By

Published : Dec 3, 2019, 10:07 AM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్​లో గత నెల 30న జరిగిన సుధాకర్​ అతని భార్య విజయలక్ష్మిల హత్య కేసును జిన్నారం పోలీసులు ఛేదించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజు, భూపాల్​, సురేశ్​, పార్వతమ్మలుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

పార్వతమ్మపై లైంగిక వేధింపులు, నిందితుడు రాజు భార్యతో వివాహేతర సంబంధమే సుధాకర్​ దంపతుల హత్యకు కారణమని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు వెల్లడించారు.

శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ఇదీ చూడండి: మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..

ABOUT THE AUTHOR

...view details