అర్ధనగ్నంగా ఆందోళన - ta
నెలకు రెండు వేల రూపాయల పింఛనుతో కుటుంబాన్ని పోషించడం కష్టమని.. కరువు భత్యం చెల్లింపులు చేయాలని పింఛనర్ల సంఘం డిమాండ్ చేసింది.
పింఛనర్ల నిరసన
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు భవిష్యనిధి కార్యాలయం ముందు పెన్షన్‌దారులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ 9000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకొకసారి కరువు భత్యం ఇవ్వాలని కోరారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు అందరికీ సమానంగా పెన్షన్ అందించాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.