పట్టణవాసులను ఆరోగ్యవంతంగా ఉంచడం.. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. టీఎండీపీ ప్రాజెక్టు కింద 20లక్షల రూపాయలతో పట్టణంలోని రాజీవ్‌పార్క్, 20వ వార్డులో రెండు ఓపెన్ జిమ్‌లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తుందని వీటి ద్వారా మరిన్ని ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు వీటిని ఉచితంగా వాడుకోవచ్చని ఎక్కడ ఎలాంటి రుసుము చెల్లించొద్దని సూచించారు.
సంగారెడ్డిలో ఓపెన్ జిమ్‌లు ప్రారంభం - srd
సంగారెడ్డిలో రెండు ఓపెన్ జిమ్‌లను మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ప్రారంభించారు. యువకులు ఉచితంగా వాడుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.
ఓపెన్ జిమ్‌లు ప్రారంభం