సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నసాగర్ గ్రామశివారులోని అన్నసాగర్ చెరువు కట్ట కింది భాగంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఓ వ్యక్తి మృతి - accident
ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అన్నసాగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఓ వ్యక్తి మృతి
మృతదేాహాన్ని జోగిపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ మల్లేశం, దుర్గాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకటరాజా గౌడ్ తెలిపారు. మృతుడు ఈశ్వరయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇవీ చూడండి: తాటి చెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడు మృతి