సంగారెడ్డి జిల్లా చింతకుంటకు చెందిన రామయ్య ఉపాధి వెతుక్కుంటూ భార్యతో కలిసి 20 ఏళ్ల కిందట ఇస్నాపూర్ వచ్చి ఓ పరిశ్రమలో పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి చెందిన బర్రెలదొడ్డిలో పనికి కుదిరి అక్కడే ఉండేవాడు. ఈ నెల 27న తన స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు. కాని మళ్లీ తిరిగి రాలేదు. బంధువులు కూడా ఇంటికి రాలేదని తెలిపారు. ఈ విషయమై కుటుంబసభ్యులు పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటికెళ్లొస్తానని వెళ్లిన వృద్ధుడు అదృశ్యం - sangareddy
ఉన్న ఊరు.. సొంత ఇంటిని వదులుకొని ఉపాధికోసం నగరానికొచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. సంగారెడ్డికి చెందిన రామయ్య అనే వృద్ధుడు ఈనెల 27న స్వగ్రామానికి వెళ్లొస్తానంటూ వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.
ఇంటికెళ్లొస్తానని వెళ్లిన వృద్ధుడు అదృష్యం