తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులు ధరించకపోతే.. జరిమానాల మోతే...

లాక్​డౌన్​ సడలింపుల కారణంగా కార్యాలయాల వద్దకు జనం గుంపులు గుంపులుగా చేరుకుంటున్నారు. నిబంధనలు మరిచి ప్రవర్తిస్తున్నారు. గమనించిన అధికారులు జరిమానాల అస్త్రం ప్రయోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్​ సబ్​రిజిస్టర్​ కార్యలయానికి వచ్చిన వారిలో మాస్కులు లేని వారికి జరిమానాలు విధించారు.

By

Published : May 11, 2020, 11:46 AM IST

officers charging fines for no mask in narayankhed
మాస్కులు ధరించకపోతే.. జరిమానాల మోతే...

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద మాస్కులు ధరించని వారికి మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు విక్రయాలు ప్రారంభించడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుంటున్నారు.

లాక్​డౌన్​ నింబంధనలు మరిచిపోయిన జనాలు... ఇష్టారీతిన వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నా ఎవరు పట్టుంచుకోవడం లేదు. స్టాంప్ వెండర్లు కూడా మాస్కులు లేకుండానే పనులు చేస్తున్నారు. ఈ తంతు చూసిన అధికారులు తొలుత వారికే అధికారులు జరిమానా విధించారు.

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ABOUT THE AUTHOR

...view details