సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు' - sangareddy district latest news today
కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పటాన్చెరు నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. అందుకు చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.
'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'
ప్రతి మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో ఆ వ్యాధిని పట్టించుకోకపోవడం వల్ల బాధితులు పెరిగిపోతున్నారు అన్నారు. అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజా శ్రేయస్సు కోసమే అని గ్రహించాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి :సహకరించండి.. లేకపోతే 24 గంటల కర్ఫ్యూ: కేసీఆర్