NABARD CGM Visits Mirzampally Thanda: నాబార్డు-ట్రైకర్ సౌజన్యంతో 'స్కోప్ స్వచ్ఛంద సంస్థ' రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 60 లక్షలతో ఏర్పాటు చేయనున్న దాల్మిల్, కందులు, శనగల గోదాం నిర్మాణ పనులకు మిర్జంపల్లి తండాలో నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల శంకుస్థాపన చేశారు. నాబార్డు చేయూతతో పేదల భూముల్లో పండ్ల తోటలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఆదర్శనీయమన్నారు.
రైతు సంఘాలకు ఉజ్వల భవిష్యత్తు - telangana latest news
NABARD CGM Visits Mirzampally Thanda: అవకాశాలను అందిపుచ్చుకుని సంఘటితంగా ముందుకు సాగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మిర్జంపల్లి తండాలో ఆమె పర్యటించారు.
NABARD
తండాల్లో లంబాడ సంప్రదాయ వస్త్రాల తయారీ, మగ్గం శిక్షణ తదితరాలను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు సీజీఎం సుశీలకు లంబాడీ దుస్తులు అలంకరింపజేశారు. అనంతరం బంజారా రైతు కుటుంబాలకు ఆవులు, మేకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాబార్డు సహాయ మేనేజర్ పియూశ్, డీడీఎంలు సెసిల్ తిమోతి, క్రిష్ణతేజ, స్కోప్ మేనేజర్ రాజు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: