తెలంగాణ

telangana

ETV Bharat / state

'భర్త ఎంపీ కావాలని భార్య ప్రచారం' - BB PATIL

ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. నిజమే అని నిరూపిస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భర్తల తరఫున భార్యలు ప్రచారాలు చేస్తున్నారు. ఎలాగైనా గెలిపించుకోవాలని కష్టపడుతున్నారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరుగుతున్నారు.

'భర్త ఎంపీ కావాలని భార్య ప్రచారం'

By

Published : Apr 8, 2019, 2:20 PM IST

నామినేషన్ వేసినప్పటి నుంచే అభ్యర్థుల సతీమణులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల సమయం సమీపించడం వల్ల ప్రచారాలను మరింత ముమ్మరం చేశారు అభ్యర్థుల సతీమణులు. జహీరాబాద్ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​కు మద్దతుగా ఆయన సతీమణి అరుణా పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సతీమణి మధులత మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'భర్త ఎంపీ కావాలని భార్య ప్రచారం'

ABOUT THE AUTHOR

...view details