హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పుర్, షంషేల్లాపూర్ గ్రామాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతీ పౌరుడు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
'హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం' - haritha haaram program in nalkal mandal
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొన్నారు. హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే వివరించారు. అవకాశమున్న ప్రతీ చోట మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
'హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం'
గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలతో పాటు అవకాశమున్న ప్రతీ చోట విరివిగా మొక్కలు నాటాలన్నారు. తమతమ గ్రామాలు హరితపల్లెలుగా మారేందుకు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు స్వప్న భాస్కర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.