పటాన్చెరు నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలోని మార్కెట్ యార్డులో పశువుల విక్రయ మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు.
పటాన్చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పశువుల విక్రయ మార్కెట్‌ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. చుట్టు పక్కల రైతులు, వ్యాపారులు ఈ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పశువుల విక్రయ మార్కెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు చుట్టు పక్కల రైతులకు, వ్యాపారులకు ఈ మార్కెట్ ఎంతో అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువులను ఇక్కడికి తీసుకొచ్చి.. విక్రయించడం ద్వారా మార్కెట్‌కు ఆదాయం చేకూరుతుందని అన్నారు. త్వరలోనే మార్కెట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.