రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను రక్షించాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో విడత హరితహారంలో భాగంగా 14 వ వార్డులోని మల్లన్న స్వామి దేవాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ సమున్నత లక్ష్యంతో ఆరేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మొక్కల పెంపకంతో భవిష్యత్తు ఆరోగ్యమయం: ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 14 వ వార్డులోని మల్లన్న స్వామి ఆలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.
mla mahipal reddy participated in haritha haaram
రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పచ్చటి వాతావరణంతో పర్యావరణం పరిరక్షించడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం ఏర్పడుతుందని వివరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య
TAGGED:
plantation