MLA Jaggareddy Latest Comments : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి పోటీ చేయరని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ విషయంపై ప్రస్తుతం రికార్డెడ్‌గా ధ్రువీకరించలేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదోనని ఇప్పుడూ చెప్పలేనని దాటవేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఎలాంటి నిర్ణయాన్నైనా ప్రకటించే ముందు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారని తాను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు.
MLA Jaggareddy Latest Comments : 'ఎన్నికల్లో పోటీపై ఇప్పుడేమీ చెప్పలేను' - ఎన్నికల్లో పోటీపై జగ్గారెడ్డి లేటెస్ట్ కామెంట్స్
MLA Jaggareddy Latest Comments : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ జరిగిన ప్రచారాన్ని రికార్డెడ్‌గా ప్రస్తుతం ధ్రువీకరించలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై అవునని కానీ.. కాదని కానీ చెప్పలేనంటూ దాటవేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారని తాను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు.
Jaggareddy on Contesting in next Elections : అసలేం జరిగిందంటే..తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డిలోని ఓ కార్యకర్త పోటీ చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలో దింపుతానని జగ్గారెడ్డి తెలిపారు. తాను మాత్రం 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
Jaggareddy on Contesting Elections 2022 : ఈ విషయంపైనే మీడియా ఆయణ్ని మరోసారి ప్రశ్నించగా.. ప్రస్తుతం ఈ అంశాన్ని రికార్డెడ్‌గా ధ్రువీకరించలేనని చెప్పారు. ఈ అంశంపై అవునని కానీ.. కాదని కానీ చెప్పలేనంటూ దాటవేశారు. గతకొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహారశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు. సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదనే ఆరోపణలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి సైతం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధిష్ఠానం పెద్దలతోనూ జగ్గారెడ్డి చర్చించారు. ఆ తర్వాత బహిరంగ విమర్శలు చేయబోనని చెప్పినా.. మళ్లీ రేవంత్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో అంతంతమాత్రంగానే ఉంటున్న ఆయన.. తాజాగా ఎన్నికల్లో పోటీపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.