సంగారెడ్డిలో 130 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) తెలిపారు. తన మిత్రుల సహాయంతో విగ్రహ స్థాపన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ హాల్‌లో మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హరియాణాకు చెందిన యూనివర్సల్ ఇండియా విగ్రహాల తయారీ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
'130 అడుగుల గాంధీ విగ్రహాన్ని స్థాపిస్తాం' - '130 అడుగుల గాంధీ విగ్రహ స్థాపన కోసం సన్నాహాలు'
సంగారెడ్డిలో మహాత్మా గాంధీ భారీ విగ్రహ స్థాపన కోసం సీరియస్‌గా పనిచేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. స్థల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
బాపూజీ విగ్రహ స్థాపన కోసం ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి టీపీసీసీ రాష్ట్ర నాయకత్వంతో భూమి పూజ చేయిస్తామన్నారు. భావి తరాలకు గాంధీ ఆదర్శాలు గుర్తుండే విధంగా విగ్రహ స్థాపన ఉంటుందని చెప్పారు. గాంధీ విగ్రహం పక్కనే మరో ముగ్గురు మహానీయుల విగ్రహాలు నెలకొల్పేలా ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ 130అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం లేదన్నారు. విగ్రహ స్థాపన తన తల్లిదండ్రులు జమ్మయమ్మా, జగ్గారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చూడండి:'హిందూ దేవాలయాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు'