రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం ఉచితంగా నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలను సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అధికారులను నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1354.59 కోట్ల వ్యయంతో 15వేల 660 ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
షీర్వాల్ టెక్నాలజితో డబుల్ బెడ్ రూం ఇళ్లు: మంత్రి కేటీఆర్ - KTR Latest news
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండు పడక గదుల నిర్మాణాలను సభాపతి పోచారంతో కలిసి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్
124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాకుల్లో అత్యాధునిక షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మిస్తున్నారు. అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నారు. పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్
ఇవీచూడండి: 'జీరో అవర్‌లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'
Last Updated : Sep 10, 2020, 5:13 PM IST